అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందించాలి.!

నాగుపల్లిలో తొలి ఆన్‌లైన్ నమోదు చేసిన ఎమ్మెల్యే జారె ఆదినారాయణ.

అర్హులైన ప్రతి కుటుంబానికి ఇందిరమ్మ బీమా అందించాలి.!

దమ్మపేట, నవంబరు 20 (తెలంగాణ ముచ్చట్లు):

ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం అర్హులైన ప్రతి కుటుంబానికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అశ్వారావుపేట ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సూచించారు. ఏ ఒక్క అర్హ కుటుంబం నమోదు కాకుండా మిగిలిపోరాదని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గ తొలి నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో చేపట్టారు. గ్రామానికి చెందిన చిలకా లక్ష్మీదేవి పేరుతో తొలి ఆన్‌లైన్ నమోదును ఎమ్మెల్యే స్వయంగా ప్రారంభించారు. అర్హులైన కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే పథకం లక్ష్యమన్నారు. గ్రామాల్లో అర్హులను గుర్తించి ప్రతి ఒక్కరికీ పథకం వర్తించేలా చూడాలని, ప్రజలకు అవగాహన కల్పిస్తూ నమోదు ప్రక్రియను పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కక్కిరాల రమేష్, పీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిశెట్టి సత్యప్రసాద్, ఎంపీడీవో రవీంద్రరెడ్డి, ఎమ్మార్వో మద్దినేని మురళీ, ఏడీఈ రవికుమార్, సర్పంచ్ శ్రీనివాసరావు, కుంపటి వేణు తదితరులు పాల్గొన్నారు.IMG-20261120-WA0007

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
*అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ.. పథకం అమలులో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం.* మానకొండూర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): పేద,...
ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.