ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.

ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.

అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు 

ముల్కనూర్‌లో అవగాహన, అమలు చర్యలు

భీమదేవరపల్లి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేసేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టారు. హుస్నాబాద్ నియోజకవర్గం, భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో ఈ పథకం అమలుపై ప్రత్యేకంగా దృష్టి సారించారు.

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశాల మేరకు గ్రామంలోని అర్హులైన కుటుంబాలకు రూ.5 లక్షల జీవిత బీమా భరోసా కల్పించేలా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ పథకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల వయస్సు కలిగిన అర్హులైన కుటుంబ యజమానులకు జీవిత బీమా రక్షణ లభించనుంది. కుటుంబ పెద్దకు ఏదైనా అనుకోని ఆపద ఎదురైనప్పుడు కుటుంబ సభ్యులకు ఆర్థికంగా అండగా నిలవడమే ఈ పథకం ప్రధాన ఉద్దేశం.

ఈ కార్యక్రమంలో ముల్కనూర్ మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జాలి ప్రమోద్ రెడ్డి, ఉపసర్పంచ్ కసుగోని మమత బాలకృష్ణ, భీమదేవరపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోచంపల్లి రాజిరెడ్డి, మండల ఎంపీడీవో వీరేశం పాల్గొన్నారు.

వీరితో పాటు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు, ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొని అర్హులైన కుటుంబాలకు పథకం ప్రయోజనాలు అందేలా చర్యలు చేపట్టారు.

ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రతి కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత. ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
అర్హులైన కుటుంబాలకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు  ముల్కనూర్‌లో అవగాహన, అమలు చర్యలు భీమదేవరపల్లి, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): ప్రతి కుటుంబానికి ఆర్థిక...
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.
ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా.