భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.

భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.

*కిడ్స్ కేర్ స్కూల్‌లో సాంప్రదాయ, సాంస్కృతిక దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ.*

*చిన్నారుల వేషధారణలు, నృత్య ప్రదర్శనలతో అలరించిన విద్యార్థులు.*

కరీంనగర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు)

భారతీయ సంస్కృతి, సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్‌లోని కిడ్స్ కేర్ సెంటర్ అండ్ ఇంగ్లీష్ మీడియం స్కూల్‌లో సాంప్రదాయ, సాంస్కృతిక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల చిన్నారులు వివిధ సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చిన్నారుల రంగురంగుల వేషధారణలతో పాఠశాల ప్రాంగణం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.

ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే పాటలు, నృత్యాలు, వివిధ సాంస్కృతిక ప్రదర్శనలతో అందరినీ ఆకట్టుకున్నారు. చిన్నారుల ఉత్సాహభరిత ప్రదర్శనలు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను ఎంతగానో అలరించాయి. చిన్నతనం నుంచే పిల్లలకు మన సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పించడంలో ఇలాంటి కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ జక్కుల గిరిబాబు పాల్గొని చిన్నారుల ప్రదర్శనలను తిలకించి వారిని అభినందించి ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు ఎంతో విశిష్టమైనవని, వాటి గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు భావితరాలకు అందించాల్సిన బాధ్యత ఉందన్నారు. మన సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకుంటూ ముందుకు సాగాలని చిన్నారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు,సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.IMG-20261120-WA0028

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి. ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.
*అర్హులైన ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక రక్షణ.. పథకం అమలులో నిర్లక్ష్యం వద్దని అధికారులకు ఎమ్మెల్యే ఆదేశం.* మానకొండూర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): పేద,...
ఇందిరమ్మ కుటుంబ బీమాతో ప్రతి ఇంటికి ఆర్థిక భద్రత.
నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే.
విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టిన చిన్నారులు.
ఇందిరమ్మ బీమా పథకం అమలుపై యాదగిరి సునీల్ రావు క్షేత్రస్థాయి పరిశీలన.
దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.