విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేసిన ఎంఈఓ ప్రకాష్.
అడ్డాకుల,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలంలోని బలీదుపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించిన పాఠశాల యూనిఫామ్స్, షూస్‌ను ఎంఈఓ ప్రకాష్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన విద్యార్థులకు యూనిఫామ్స్, షూస్ అందజేసి వారి చదువుకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వివరించారు.ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో భాగంగా ప్రభుత్వం యూనిఫామ్స్, షూస్ పంపిణీ చేస్తోందని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు. పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థులకు నాణ్యమైన విద్యాబోధన అందిస్తూ వారి అభ్యున్నతికి కృషి చేయాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కరుణాకర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సువర్ణలత, ఉపాధ్యాయులు భాస్కర్, శాంతాబాయి, పాఠశాల చైర్మన్ మంగరాయి భార్గవి, ఉపసర్పంచ్ రాధ శివ, ఐదో వార్డు సభ్యులు వై. ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు రంజిత్ కుమార్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.


Comments