దివ్యాంగులకు స్వయం ప్రయాణ భాగ్యం కల్పించిన గంగుల.
సొంత ఖర్చులతో ఐదుగురికి ఎలక్ట్రిక్ మూడు చక్రాల సైకిళ్ల పంపిణీ.. స్వయం ఆధారిత జీవనానికి భరోసా.
కరీంనగర్, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
ఆపదలో ఉన్న నిరుపేదలకు అండగా నిలుస్తూ మానవత్వాన్ని చాటుకుంటున్న మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ మరోసారి తన సేవా నిరతిని చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులతో అవసరమైన వాహనాలను కొనుగోలు చేయలేని నిరుపేద దివ్యాంగులకు తన సొంత నిధులతో ఎలక్ట్రిక్ మూడు చక్రాల సైకిళ్లను అందజేశారు.
కరీంనగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన కార్యక్రమంలో శివ కిషోర్, మాధవి, లచ్చయ్య, పోచమల్లు, శివ అనే ఐదుగురు లబ్ధిదారులకు ఎలక్ట్రిక్ మూడు చక్రాల సైకిళ్లను గంగుల కమలాకర్ పంపిణీ చేశారు. ఈ వాహనాల ద్వారా దివ్యాంగులు రోజువారీ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడకుండా స్వయంగా ప్రయాణించడంతో పాటు తమ పనులను స్వతంత్రంగా చేసుకునేందుకు అవకాశం కలగనుంది.
ఆర్థికంగా వెనుకబడిన, శారీరక వైకల్యంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారిని ఆదుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతగా భావించాలని గంగుల కమలాకర్ పేర్కొన్నారు. ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూడకుండా తన పరిధిలో ఉన్న నిరుపేదలకు వ్యక్తిగతంగా చేయూత అందిస్తూ, వారి ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి స్వయం ఆధారిత జీవనానికి తోడ్పడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టారు.
సైకిళ్లు అందుకున్న లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తూ గంగుల కమలాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రయాణ కష్టాలు తీరడంతో పాటు నిత్యజీవితంలో ఎంతో వెసులుబాటు కలుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.


Comments