విద్య ద్వారానే వికాసం.. ప్రపంచ దేశాలకు విద్యాభారతి ఆదర్శం.

విద్య ద్వారానే వికాసం.. ప్రపంచ దేశాలకు విద్యాభారతి ఆదర్శం.

* భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విలువల విద్యను అందించడమే విద్యాభారతి లక్ష్యం

* లింగం సుధాకర్ రెడ్డి

జమ్మికుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

విద్య ద్వారానే వ్యక్తి వికాసం, సమాజ అభివృద్ధి సాధ్యమని, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలతో కూడిన విద్యను అందించడంలో విద్యాభారతి సంస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలుస్తోందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్ర సంఘటన కార్యదర్శి లింగం సుధాకర్ రెడ్డి అన్నారు. జమ్మికుంట పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో నూతనంగా నిర్మించిన అదనపు తరగతి గదుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్‌తో కలిసి నూతన భవనాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా లింగం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తూ నైతిక విలువలతో కూడిన విద్యను అందించే సంస్థలు విద్యాభారతి, సరస్వతి శిశు మందిర్ పాఠశాలలని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ఇటువంటి పాఠశాలల్లో చేర్పించి దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే విద్యార్థులుగా తయారు చేయాలని కోరారు. పాఠశాలల అభివృద్ధికి సమాజం నుంచి మరింత ఆదరణ లభించాలని, దాతలు, పాఠశాల సమితులు, కార్యవర్గాలు సహకరిస్తే తరగతి గదులతో పాటు గ్రంథాలయాలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, సైన్స్ ల్యాబ్‌లు, చిన్నారుల పార్కుల వంటి సదుపాయాలు కల్పించేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
అనంతరం పాఠశాల అభివృద్ధి ప్రస్థానాన్ని వివరిస్తూ నిర్వాహకులు మాట్లాడుతూ ఒకప్పుడు తెలుగు మాధ్యమంలో విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తూ విద్యాబోధన అందించామని, మారుతున్న కాలానికి అనుగుణంగా జాతీయ విద్యా విధానాన్ని అనుసరిస్తూ ఇంగ్లీష్ మీడియంలోనూ బోధన ప్రారంభించామని తెలిపారు. ఈ పాఠశాలలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు అమెరికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల్లో స్థిరపడి ఉన్నత స్థాయికి ఎదగడం గర్వకారణమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి మంతెన హేమలత, ఆర్ఎస్ఎస్ విభాగ్ కార్యవాహ పాక సత్యనారాయణ, శ్రీ సరస్వతి విద్యాపీఠం అధ్యక్షుడు ముక్కాల సీతారాములు, పూర్వ విద్యార్థి, సినీ దర్శకుడు వీరి వేణుగోపాల్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ జావేద్, జిల్లా కార్యదర్శి తెల్ల రాజమౌళి, డాక్టర్ చిట్టి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఆవాల రాజారెడ్డి, ఆకుల రాజేందర్, శీలం శ్రీనివాస్, దాస రవీందర్, బుర్ర శివయ్య, కేతిపల్లి మాధవరెడ్డి, పాకాల రవీందర్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ప్రధానాచార్యులు గుడికందుల సుదర్శన్, ఉపాధ్యాయులు, విద్యాభిమానులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.IMG-20261120-WA0038

Tags:

Post Your Comments

Comments

Latest News

విద్య ద్వారానే వికాసం.. ప్రపంచ దేశాలకు విద్యాభారతి ఆదర్శం. విద్య ద్వారానే వికాసం.. ప్రపంచ దేశాలకు విద్యాభారతి ఆదర్శం.
* భారతీయ సంస్కృతి, సంప్రదాయాలతో కూడిన విలువల విద్యను అందించడమే విద్యాభారతి లక్ష్యం * లింగం సుధాకర్ రెడ్డి జమ్మికుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): విద్య...
జమ్మికుంటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమానికి శ్రీకారం.
జమ్మికుంట వేదికగా ఎస్ఎఫ్ఐ జిల్లా 19వ మహాసభలు.
మెడికల్ సీటు సాధించిన భవ్యశ్రీకి ఎమ్మెల్యే సత్కారం.
దళిత చైతన్య సభను విజయవంతం చేయాలి.
దేవమ్మ మృతికి వడ్డే శేఖర్ ప్రగాఢ సంతాపం.
ఇందిరమ్మ జీవిత బీమా భరోసా పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి.