దేవమ్మ మృతికి వడ్డే శేఖర్ ప్రగాఢ సంతాపం.
Views: 0
On
పెద్దమందడి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని వెల్టూర్ గ్రామానికి చెందిన బత్తుల బుడ్డన్న భార్య దేవమ్మ మృతి పట్ల గ్రామ కాంగ్రెస్ నాయకుడు వడ్డే శేఖర్ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ప్రగాఢ సంతాపం తెలిపారు.ఈ సందర్భంగా దేవమ్మ మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మృతురాలి భర్త బత్తుల బుడ్డన్నను, కుటుంబ సభ్యులను పరామర్శించి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.కుటుంబ సభ్యులకు ఈ కష్టసమయంలో ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, దేవమ్మ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
20 Nov 2026 20:05:14
పెద్దమందడి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
నేడు నాగర్కర్నూల్ పట్టణంలో నిర్వహించనున్న దళిత చైతన్య సభను విజయవంతం చేయాలని వనపర్తి జిల్లా పెద్దమందడి మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు గట్టు మన్నెం...


Comments