మెడికల్ సీటు సాధించిన భవ్యశ్రీకి ఎమ్మెల్యే సత్కారం.
పెద్దమందడి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలంలోని అమ్మపల్లి గ్రామానికి చెందిన బోయిని భవ్యశ్రీ ఆసిఫాబాద్‌లో మెడికల్ సీటు సాధించడంతో వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆమెను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందించారు.మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్ అన్న శివ యాదవ్, పద్మ దంపతుల కుమార్తె భవ్యశ్రీ వైద్య విద్యకు ఎంపిక కావడం పట్ల ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థినిని అభినందిస్తూ ఆమె భవిష్యత్తులో ఉన్నత విద్యను అభ్యసించి వైద్య రంగంలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చడంతో పాటు కన్న ఊరికి, కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యాపరంగా ఎలాంటి అవసరాలు, సహాయ సహకారాలు కావాలన్నా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి, మాజీ సర్పంచ్ రమేష్ యాదవ్, వెంకటేశ్వర రెడ్డి, బాలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments