చెకుముఖి ప్రతిభా పరీక్షలో మండల ఫస్ట్  శ్రీ ఆదర్శ .

చెకుముఖి ప్రతిభా పరీక్షలో మండల ఫస్ట్  శ్రీ ఆదర్శ .

ఖమ్మం బ్యూరో, నవంబర్ 21(తెలంగాణ ముచ్చట్లు )

చెకుముకి మండల స్థాయి ప్రతిభ పరీక్షలో చింతకాని మండలం నాగులవంచ శ్రీ ఆదర్శ విద్యాలయం విద్యార్థులు మండల ప్రథమ స్థానం సాధించారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో పందిళ్ళపల్లి జడ్పీ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి చెకుముకి ప్రతిభా పరీక్ష శనివారం నిర్వహించారు. ఈ మండల స్థాయి పరీక్షకు 15 ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. శ్రీ ఆదర్శ పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థిని మందా నిరోష, 9వ తరగతి విద్యార్థి చక్కిలాల రాజేష్, 8వ తరగతి విద్యార్థి రౌతు శ్రీరంగధనుష్ లు మండల స్థాయి ప్రథమ స్థానం సాధించారు.  విజేతలైన విద్యార్థులకు డి సి ఈ బీ కార్యదర్శి కనపర్తి వెంకటేశ్వర్లు, ఎంఈఓ సలాది రామారావు, పాఠశాల హెచ్ఎం దొండపాటి వెంకటేశ్వరరావు బహుమతులు అందజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News