పీచరలో ఆగని ఇసుక దందా.. రాత్రివేళల్లో అక్రమ తరలింపు!

పీచరలో ఆగని ఇసుక దందా.. రాత్రివేళల్లో అక్రమ తరలింపు!

ట్రిప్పు ఇసుక రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయం.. అధికారుల చర్యలు ఎప్పుడు?

వేలేరు, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచర గ్రామంలోని ఎల్లమ్మ వాగులో అక్రమ ఇసుక దందా యథేచ్ఛగా కొనసాగుతోందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి వేళల్లో ఇసుకను తవ్వి వాహనాల ద్వారా తరలిస్తున్నట్లు చెబుతున్నారు.
ఒక్కో ట్రిప్పు ఇసుకను రూ.8 వేల నుంచి రూ.10 వేల వరకు అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారని, దీంతో ఇసుక అవసరమైన నిరుపేదలు తీవ్ర ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తవ్వకాలు, రవాణా జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎల్లమ్మ వాగులో జరుగుతున్న అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణాపై తనిఖీలు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.IMG-20261121-WA0027

Tags:

Post Your Comments

Comments

Latest News