కాషాయ సైన్యం కదం తొక్కాలి.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి!

కాషాయ సైన్యం కదం తొక్కాలి.. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి!

-23న కరీంనగర్‌లో లక్ష మందితో మహా పాదయాత్ర.. 

-ఎల్కతుర్తి నుంచి భారీగా తరలిరావాలని శ్రీకాంత్ యాదవ్ పిలుపు

ఎల్కతుర్తి నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు): 

కాషాయ సైన్యం ఐక్యంగా కదిలి దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా జరిగే తప్పుడు ప్రచారాలను ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని బీజేపీ ఎల్కతుర్తి మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నెల 23న కరీంనగర్‌లో నిర్వహించనున్న లక్ష మందితో కూడిన మహా పాదయాత్రను విజయవంతం చేయాలని కోరుతూ ఎల్కతుర్తి మండల కేంద్రంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మండల ప్రభారి లక్కిరెడ్డి తిరుమల పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ, దాని మిత్రపక్షాలు తప్పుడు ప్రచారాలతో ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ప్రచారాలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల్లోకి వెళ్లి తిప్పికొట్టాల్సిన అవసరం ఉందన్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంపై దేశ యువత విశ్వాసంతో ఉందని, దేశ అభివృద్ధి, జాతీయ భద్రత, దేశ స్వాభిమానం విషయంలో యువత మోదీకి అండగా నిలుస్తోందని పేర్కొన్నారు. ఈ విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే మహా పాదయాత్ర ప్రధాన ఉద్దేశమని తెలిపారు.

ఈ నెల 23న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో లక్ష మందితో భారీ మహా పాదయాత్ర నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు.

ఎల్కతుర్తి మండలం నుంచి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి మహా పాదయాత్రను విజయవంతం చేయాలని శ్రీకాంత్ యాదవ్ పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త కాషాయ సైనికుడిలా ముందుకు సాగి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.IMG-20261121-WA0015

ఈ సమావేశంలో మండల పార్టీ నాయకులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు పాల్గొని మహా పాదయాత్ర విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News