దళితుల ఆసరా పెన్షన్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.

దళితుల ఆసరా పెన్షన్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.

* అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్లు అందిస్తాం.. 

* కాంగ్రెస్ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్

జమ్మికుంట, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

హుజురాబాద్ నియోజకవర్గంలో దళితులకు గతంలో దళితబంధు పథకం అమలైనందున వారికి ఆసరా పెన్షన్లు రావని, ఇప్పటికే పెన్షన్లు రద్దయ్యాయని జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జమ్మికుంట మండల అధ్యక్షుడు దొగ్గల భాస్కర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొంతమంది అవకాశవాదులు ప్రజా పాలన ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మండిపడ్డారు.
ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, గత ప్రభుత్వ హయాంలో పదేళ్ల పాటు కొత్తగా పెన్షన్లు మంజూరు చేయని పరిస్థితి ఉండేదని విమర్శించారు. ప్రస్తుతం అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించేందుకు ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఆసరా పెన్షన్ మంజూరు ప్రొసీడింగ్స్ కాపీలు అందుకున్న వారికి మాత్రమే పెన్షన్లు వస్తాయనే ప్రచారం కూడా అవాస్తవమని పేర్కొన్నారు.
అర్హత కలిగిన వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులతో పాటు అర్హులైన దళితులందరికీ ప్రభుత్వం ఆసరా పెన్షన్లు అందిస్తుందని తెలిపారు. ఇతర రాజకీయ పార్టీల నాయకులు లేదా ఎవరైనా చెప్పే అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అర్హులైన దళితులందరికీ త్వరలోనే పెన్షన్లు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఈ సందర్భంగా భాస్కర్ స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News