ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం.
సూపరింటెండెంట్‌గా సీనియర్ వైద్యులు డాక్టర్ వాసుదేవరెడ్డి నియామకం.
హుజురాబాద్,నవంబర్ 21(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌గా సీనియర్ వైద్యులు డాక్టర్ వాసుదేవరెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి (డీసీహెచ్) డాక్టర్ కృష్ణప్రసాద్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఉత్తర్వుల ప్రకారం డాక్టర్ వాసుదేవరెడ్డి శనివారం ఆసుపత్రిలో ఇన్చార్జి సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్య బృందం, సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శాలువాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు.
బాధ్యతల స్వీకరణ అనంతరం డాక్టర్ వాసుదేవరెడ్డి మాట్లాడుతూ..
తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన డీసీహెచ్ కృష్ణప్రసాద్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రికి వచ్చే పేద రోగులకు మెరుగైన, నాణ్యమైన వైద్య సేవలు అందేలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి ఆసుపత్రికి మరింత మంచి పేరు తీసుకురావాలని కోరారు. రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించడమే తన ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యులు ప్రసాద్, పి. శ్రీకాంత్‌రెడ్డి, పాతిమెడికల్ మరియు ఇతర వైద్య సిబ్బంది పాల్గొని డాక్టర్ వాసుదేవరెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.


Comments