రూ.549 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో మరో ఇద్దరి అరెస్టు.
- సత్తుపల్లికి చెందిన ఇద్దరిని హైదరాబాద్‌కు తరలింపు.. అరెస్టుల సంఖ్య 59కి చేరిక.
సత్తుపల్లి, నవంబరు 21 (తెలంగాణ ముచ్చట్లు):
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్తుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని రూ.549 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో శనివారం మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్‌బీ) ఏసీపీ ప్రసాదరావు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు సత్తుపల్లి పట్టణానికి చెందిన మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. గుడిపాడు రోడ్డుకు చెందిన బొప్పన ఖాదర్ బాబు, బొప్పన నాగ పవన్‌లను శనివారం ఉదయం అదుపులోకి తీసుకుని హైదరాబాద్‌లోని సీఎస్‌బీ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కేసులో ఇప్పటికే 57 మందిని అరెస్టు చేసి విచారించిన అనంతరం రిమాండ్‌కు తరలించగా, తాజాగా మరో ఇద్దరి అరెస్టుతో మొత్తం నిందితుల సంఖ్య 59కి చేరింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ భారీ సైబర్ క్రైమ్ కేసు దర్యాప్తు వేగవంతమైంది. తాజాగా మరో ఇద్దరి అరెస్టుతో కేసు కీలక మలుపు తిరిగినట్లు చర్చ సాగుతోంది.


Comments