రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోరపల్లి విద్యార్థిని ఎంపిక.

రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు కోరపల్లి విద్యార్థిని ఎంపిక.

* ప్రతిభ చాటిన పింగిలి అక్షర.. 

* ఉపాధ్యాయులు, గ్రామస్తుల అభినందనలు

జమ్మికుంట, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఈ నెల 20న నిర్వహించిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పాఠశాలల క్రీడా సమాఖ్య (ఎస్‌జీఎఫ్) అండర్‌-14 బాలబాలికల కబడ్డీ టోర్నమెంట్‌ కమ్‌ సెలెక్షన్స్‌లో కోరపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థిని పింగిలి అక్షర అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైంది.
ఈ నెల 22 నుంచి 24వ తేదీ వరకు మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో జరగనున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో అక్షర పాల్గొననుంది. విద్యార్థిని ఎంపిక కావడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు కేతిరి శ్రీనివాస్ రెడ్డి, వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడు జిట్టబోయిన శ్రీను హర్షం వ్యక్తం చేశారు. క్రీడల్లో మరింత ప్రతిభ కనబరిచి పాఠశాలకు, గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
విద్యార్థిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక కావడం పట్ల జమ్మికుంట మండల విద్యాధికారి మంథని హేమలత, ఉపాధ్యాయులు, ఉపాధ్యాయినులు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ రజిత, సర్పంచ్ మధుసూదన్, ఉప సర్పంచ్ రాజు యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. గ్రామ యువకులు, ప్రజలు అక్షరకు అభినందనలు తెలియజేశారు.

IMG-20261121-WA0022

Tags:

Post Your Comments

Comments

Latest News