నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు.

నూతన వధూవరులను ఆశీర్వదించిన ప్రముఖులు, ప్రజాప్రతినిధులు.

వనపర్తి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు): 

వనపర్తి పట్టణంలోని ఆర్జీ గార్డెన్‌లో ఉపాధ్యాయులు బొరెల్లి వెంకటయ్య కుమార్తె ఖ్యాతి సుధన్, శివకుమార్‌ల వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు, ఉపాధ్యాయులు, సామాజిక నాయకులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో వనపర్తి బార్ అసోసియేషన్ అధ్యక్షులు, జి.పి. కీరన్ కుమార్, ఏఐఎంఈఎఫ్ జాతీయ కోర్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డాల కృష్ణ, వనపర్తి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొల్లా వెంకటేష్, ఎమ్మార్పీఎస్ నాయకులు కేశపోగు కేశవులు, కొమ్ము చెన్నకేశవులు, గంధం గట్టయ్య, శివన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నూతన దంపతులకు వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. వధూవరుల కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News