ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.

పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన శివ యాదవ్, రాముల యాదవ్ కుటుంబాలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి, ఆయన సతీమణి శారదారెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలియజేసి, నూతన వస్త్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంత ఇల్లు నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి కల అని, ఆ కలను సాకారం చేసుకోవడం ఎంతో ఆనందకరమైన విషయమని అన్నారు. సొంతింటి కల నెరవేరినప్పుడే కుటుంబానికి భరోసా, భద్రత కలుగుతాయని పేర్కొంటూ నూతన గృహ యజమానులకు శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ రామకృష్ణారెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పెద్దమందడి మాజీ సర్పంచ్ వెంకటస్వామి, గౌని వెంకటేశ్వరరెడ్డి, చింతల వెంకటేశ్వర్లు, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు. ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన శివ యాదవ్, రాముల యాదవ్ కుటుంబాలు నూతనంగా నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాలకు...
ఘనంగా మత్స్యకారుల దినోత్సవం.
రూ.549 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో మరో ఇద్దరి అరెస్టు.
పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు చేపట్టాలి.
దళితుల ఆసరా పెన్షన్లపై తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దు.
గురువుపై గౌరవం.. రెండు దశాబ్దాలైనా చెరగని అనుబంధం.
పోతిరెడ్డిపల్లిలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రారంభం.