ఘనంగా మత్స్యకారుల దినోత్సవం.
పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
ప్రపంచ మత్స్యకారుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వనపర్తి జిల్లా పెద్దమందడిలోని మత్స్యశాఖ కమిటీ హాలు సమీపంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మత్స్యశాఖ అధ్యక్షుడు వాకిటి నరేష్ కుమార్ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు.ఈ సందర్భంగా అధ్యక్షుడు వాకిటి నరేష్ కుమార్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ ఐక్యంగా ముందుకు సాగాలని అన్నారు. సమాజంలో మత్స్యకారుల పాత్ర ఎంతో కీలకమని, వారి కష్టానికి తగిన గుర్తింపు, గౌరవం లభించాలని పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి, వారి అభ్యున్నతికి సంఘం ఎల్లప్పుడూ కృషి చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మత్స్యశాఖ ఉపాధ్యక్షుడు వాటి రమేష్, కార్యదర్శి జంగం రమేష్, మాజీ అధ్యక్షులు ఎన్. కురుమూర్తి, వి. నాగభూషణ్, ఎన్. రామాంజనేయులు, ఈ. మహేష్, కొత్త వెంకటన్న, అవంగాపురం నాగభూషణ్, చిన్న ఆంజనేయులు, ఈ. శ్రీనివాసులు, బాలరాజు, కే. పరమేష్, కే. వెంకటేష్, ఎన్. భాస్కర్, కొత్త స్వామి, కొత్త నాగన్న, జంగం శంకర్ తదితర మత్స్యశాఖ సభ్యులు, కుల పెద్దలు పాల్గొన్నారు.


Comments