గ్రామీణ పేదలకు ప్రభుత్వ పథకాల భరోసా.

ఇందిరమ్మ బీమా పత్రాలు, నూతన రేషన్ కార్డులు, ఆసరా పెన్షన్ ప్రొసీడింగ్స్ పంపిణీ.

గ్రామీణ పేదలకు ప్రభుత్వ పథకాల భరోసా.

ఇల్లందకుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడమే లక్ష్యంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో లబ్ధిదారులకు వివిధ సంక్షేమ పథకాల పత్రాలను పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ రేనుకుంట్ల శ్యామల కుమార్ చేతుల మీదుగా లబ్ధిదారులకు ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పత్రాలు, నూతన రేషన్ కార్డులు, చేయూత ఆసరా పెన్షన్ మంజూరు ఉత్తర్వుల ప్రతులను అందజేశారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ ప్రజా సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజలకు అవసరమైన సంక్షేమ పథకాలను చేరవేయడంతో పాటు వారి సమస్యలను పరిష్కరించడం, గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజాసేవకు నిరంతరం కట్టుబడి ఉంటామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సిరిసేడు గ్రామ పాలకవర్గ సభ్యులు, గ్రామ కార్యదర్శి, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.IMG-20261120-WA0034

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామీణ పేదలకు ప్రభుత్వ పథకాల భరోసా. గ్రామీణ పేదలకు ప్రభుత్వ పథకాల భరోసా.
ఇల్లందకుంట, నవంబర్ 20 (తెలంగాణ ముచ్చట్లు): ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అర్హులైన ప్రతి కుటుంబానికి అందించడమే లక్ష్యంగా కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం సిరిసేడు గ్రామంలో...
విద్య ద్వారానే వికాసం.. ప్రపంచ దేశాలకు విద్యాభారతి ఆదర్శం.
జమ్మికుంటలో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా కార్యక్రమానికి శ్రీకారం.
జమ్మికుంట వేదికగా ఎస్ఎఫ్ఐ జిల్లా 19వ మహాసభలు.
మెడికల్ సీటు సాధించిన భవ్యశ్రీకి ఎమ్మెల్యే సత్కారం.
దళిత చైతన్య సభను విజయవంతం చేయాలి.
దేవమ్మ మృతికి వడ్డే శేఖర్ ప్రగాఢ సంతాపం.