పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు చేపట్టాలి.
సింగిరెడ్డి కురుమూర్తి, బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి.
పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వనపర్తికి వెళ్లే రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ పార్టీ పెద్దమందడి మండల అధికార ప్రతినిధి సింగిరెడ్డి కురుమూర్తి శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సరైన రహదారి సౌకర్యం లేకపోవడంతో నిత్యం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెద్దమందడి నుంచి వనపర్తికి వెళ్లే మార్గంలో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు, చిరు వ్యాపారులు, వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే ప్రజలు అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర నిర్వహించి, ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు గుర్తుచేశారు.అయితే రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తామని హామీలు ఇచ్చినప్పటికీ, నేటికీ పనులు పూర్తిస్థాయిలో కొనసాగకపోవడం విచారకరమన్నారు. ఎన్నికల సమయంలో, ప్రజా సమస్యలపై హామీలు ఇవ్వడమే కాకుండా వాటిని ఆచరణలో పెట్టాలని సూచించారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి పెద్దమందడి–వనపర్తి రహదారి నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని శాశ్వత రహదారి సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా 7వ వార్డు సభ్యుడు కొమ్ము బ్రహ్మయ్య, 5వ వార్డు సభ్యుడు కొమ్ము విష్ణు తదితరులు రహదారి నిర్మాణం చేపట్టాలని కోరారు.


Comments