తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని చాటుతూ దీక్షా దివస్ మహాసభను విజయవంతం చేయాలి.

తెలంగాణ ఉద్యమ పోరాట స్ఫూర్తిని చాటుతూ దీక్షా దివస్ మహాసభను విజయవంతం చేయాలి.

*నవంబర్ 29న అల్గునూర్ సభకు భారీగా తరలిరావాలి: డాక్టర్ రసమయి బాలకిషన్*

మనకొండూర్, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ చేసిన పోరాటం, త్యాగాల స్ఫూర్తిని నేటి తరానికి చాటిచెప్పాలని మనకొండూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రసమయి బాలకిషన్ పిలుపునిచ్చారు. ఈ నెల 29న కరీంనగర్‌లోని అల్గునూర్ చౌరస్తా సమీపంలో నిర్వహించనున్న దీక్షా దివస్ స్ఫూర్తి మహాసభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని తెలిపారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో డాక్టర్ రసమయి బాలకిషన్ పాల్గొని మాట్లాడారు. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష, తీసుకున్న పటిష్టమైన నిర్ణయం ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని పేర్కొన్నారు. ఆ చారిత్రక పోరాటాన్ని ప్రజలకు, నేటి తరానికి వివరించడమే దీక్షా దివస్ సభ ముఖ్య ఉద్దేశమని అన్నారు.

ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైందని విమర్శించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబంధు, రైతుబీమా వంటి సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావడం లేదని, నిరంతర విద్యుత్ సరఫరా, యూరియా పంపిణీలోనూ సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అసంతృప్తి నెలకొందని, తిరిగి కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగడం లేదని, కొత్త పథకాల కంటే కరువు పరిస్థితులే కనిపిస్తున్నాయని విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో మరోసారి ప్రజా ఉద్యమాలకు సిద్ధం కావాలని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను పరిరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి, అక్రమాలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.

ఈ సమావేశంలో రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, సెస్ డైరెక్టర్ మల్లుగారి రవీందర్ రెడ్డి, మండల ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఉద్యమకారులు, సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News