వేలేరులో  చెకుముకి మండలస్థాయి పరీక్షలు.

విజేతలుగా జడ్పీహెచ్ఎస్ వేలేరు, కేజీబీవీ వేలేరు, సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాలలు.

వేలేరులో  చెకుముకి మండలస్థాయి పరీక్షలు.

వేలేరు, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):

హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని టీజీఆర్ఎస్ బాలుర పాఠశాలలో ఈరోజు చెకుముకి మండలస్థాయి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల విద్యాశాఖ అధికారి చంద్రమౌళి, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆర్. అజయ్ కుమార్, మండల అధ్యక్షుడు గుడికందుల రమేష్ హాజరయ్యారు. వీరితో పాటు మండలంలోని వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఈ పరీక్షల్లో ప్రభుత్వ పాఠశాలల విభాగంలో జడ్పీహెచ్ఎస్ వేలేరు ప్రథమ బహుమతి, ఎర్రబెల్లి పాఠశాల ద్వితీయ బహుమతి సాధించాయి. గురుకులాల విభాగంలో కేజీబీవీ వేలేరు ప్రథమ బహుమతి, టీజీఆర్ఎస్ జూనియర్ కళాశాల వేలేరు ద్వితీయ బహుమతి సాధించాయి. ప్రైవేట్ పాఠశాలల విభాగంలో సెయింట్ ఫ్రాన్సిస్ పాఠశాల ప్రథమ బహుమతి గెలుచుకుంది.
విజేతలుగా నిలిచిన విద్యార్థులకు మండల విద్యాశాఖ అధికారి చంద్రమౌళి బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా విజేతలైన విద్యార్థులందరూ ఈ నెల 28న నిర్వహించనున్న జిల్లా స్థాయి చెకుముకి పరీక్షల్లో తప్పనిసరిగా పాల్గొని ప్రతిభ చాటాలని నిర్వాహకులు కోరారు.
మండల అధ్యక్షుడు గుడికందుల రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ పరీక్షలను విజయవంతంగా నిర్వహించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వేలేరులో  చెకుముకి మండలస్థాయి పరీక్షలు. వేలేరులో  చెకుముకి మండలస్థాయి పరీక్షలు.
వేలేరు, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు): హనుమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలోని టీజీఆర్ఎస్ బాలుర పాఠశాలలో ఈరోజు చెకుముకి మండలస్థాయి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి...
అసాంఘిక కార్యక్రమాలకు పాటు పడితే చర్యలు తప్పవు: సిపి ఎన్.శ్వేత .
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.
పీచరలో ఆగని ఇసుక దందా.. రాత్రివేళల్లో అక్రమ తరలింపు!
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
ఘనంగా మత్స్యకారుల దినోత్సవం.
రూ.549 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో మరో ఇద్దరి అరెస్టు.