నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.

నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.

గోపాల్‌పేట,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి నియోజకవర్గ యువ నాయకులు, రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షులు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి  గోపాల్‌పేట మండలం జయన్నా తిరుమలాపురం గ్రామంలో జరిగిన వివాహ మహోత్సవానికి హాజరై సందడి చేశారు.గ్రామానికి చెందిన కీ.శే. పబ్బతి రామాంజనేయులు, పబ్బతి భాగ్యమ్మ దంపతుల కుమారుడు పబ్బతి శంకర్, భాగ్యలక్ష్మిల వివాహ వేడుకకు డా. జిల్లెల ఆదిత్య రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆప్యాయంగా పలకరించి, పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన దంపతుల జీవితం ప్రేమానురాగాలు, పరస్పర అవగాహన, సుఖసంతోషాలతో నిండాలని, ఆయురారోగ్యాలతో కలకాలం సంతోషంగా జీవించాలని ఆకాంక్షిస్తూ ఆశీర్వదించారు.వివాహ వేడుకలు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్తుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించి, వారి కుటుంబానికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామ పెద్దలు, స్థానికులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అసాంఘిక కార్యక్రమాలకు పాటు పడితే చర్యలు తప్పవు: సిపి ఎన్.శ్వేత . అసాంఘిక కార్యక్రమాలకు పాటు పడితే చర్యలు తప్పవు: సిపి ఎన్.శ్వేత .
జఫర్‌గఢ్, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు) వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్‌ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.ఈ సందర్భంగా...
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.
పీచరలో ఆగని ఇసుక దందా.. రాత్రివేళల్లో అక్రమ తరలింపు!
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
ఘనంగా మత్స్యకారుల దినోత్సవం.
రూ.549 కోట్ల సైబర్ క్రైమ్ కేసులో మరో ఇద్దరి అరెస్టు.
పెద్దమందడి–వనపర్తి రోడ్డు పనులు చేపట్టాలి.