అసాంఘిక కార్యక్రమాలకు పాటు పడితే చర్యలు తప్పవు: సిపి ఎన్.శ్వేత .
జఫర్గఢ్, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత, ఐపీఎస్ శనివారం స్థానిక పోలీస్ స్టేషన్ను సందర్శించి వార్షిక తనిఖీ నిర్వహించారు.
ఈ సందర్భంగా పోలీస్ అధికారులు సీపీకి పూల మొక్కలు అందించి స్వాగతం పలకగా, పోలీస్ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో సీపీ ఉసిరి మొక్కను నాటారు.వార్షిక తనిఖీలో భాగంగా పోలీస్ స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రికార్డులు, రిజిస్టర్లు, కేసుల వివరాలను సీపీ క్షుణ్ణంగా పరిశీలించారు. పోలీస్ స్టేషన్ సిబ్బందితో మాట్లాడి వారి విధులు, బాధ్యతలు, పనితీరుపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ...ప్రజలకు మెరుగైన పోలీస్ సేవలు అందించాలని, ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై తక్షణమే స్పందించి బాధితులకు న్యాయం జరిగేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. అలాగే
గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువత గంజాయి వంటి మాదకద్రవ్యాలకు అలవాటు పడకుండా నిరంతరం నిఘా ఉంచాలని, గంజాయి వినియోగం, విక్రయాలకు పాల్పడే వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
అలాగే పోలీస్ సిబ్బంది తమ వ్యక్తిగత ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ శారీరక దృఢత్వాన్ని కాపాడుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసీపీ అంబటి నర్సయ్య, వర్ధన్నపేట సీఐ వై. సంజీవరావు, జఫర్గఢ్ ఎస్ఐ.బొల్లం వినయ్ కుమార్, వర్ధన్నపేట ఎస్ఐ బోగం ప్రవీణ్, జఫర్గఢ్ పోలీస్ స్టేషన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments