పీఏసీ సమావేశానికి హాజరైన డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి.
వనపర్తి,నవంబర్22(తెలంగాణ ముచ్చట్లు):
హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో నూతన ఏఐసీసీ ఇన్‌చార్జి బి. సందీప్ కుమార్ అధ్యక్షతన నిర్వహించిన పీఏసీ (పొలిటికల్ అఫైర్స్ కమిటీ) అడ్వైజరీ కమిటీ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఏఐపీసీ అధ్యక్షులు, వనపర్తి నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి హాజరయ్యారు.ఈ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, రాష్ట్ర మంత్రులు, టీపీసీసీ రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి నందిమల్ల యాదయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, పార్టీ భవిష్యత్ కార్యాచరణ తదితర అంశాలపై సమావేశంలో చర్చించినట్లు సమాచారం. పీఏసీ సమావేశంలో డాక్టర్ జిల్లెల్ల ఆదిత్య రెడ్డి పాల్గొనడం ద్వారా రాష్ట్రస్థాయి పార్టీ కార్యక్రమాల్లో ఆయన భాగస్వామ్యం మరోసారి వెల్లడైంది.


Comments