మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

-మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి: ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి

-పెంచికల్‌పేటలో సంఘమిత్ర కార్యక్రమం ద్వారా సామాజిక చైతన్యం

ఎల్కతుర్తి నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు): 

మండలంలోని పెంచికల్‌పేట గ్రామంలో శనివారం ‘సంఘమిత్ర’ కార్యక్రమంలో భాగంగా సామాజిక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి, ఎల్కతుర్తి సీఐ కె. శ్రీను హాజరై ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పించారు. స్థానిక సర్పంచ్, ఉపసర్పంచ్‌లు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ మాదక ద్రవ్యాల వినియోగం వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబ వ్యవస్థను, సమాజ భవిష్యత్తును తీవ్రంగా ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, సందేశాలు, అనుమానాస్పద లింకుల పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని వివరించారు.

అలాగే సమాజ అభివృద్ధి, దేశ భవిష్యత్తు నిర్మాణంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు. మహిళలకు సమాన అవకాశాలు, ప్రాధాన్యత కల్పిస్తూ వారిని అన్ని రంగాల్లో ప్రోత్సహించినప్పుడే సమాజంలో సానుకూల మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

మాదక ద్రవ్యాల నిర్మూలన, సైబర్ నేరాల నియంత్రణ, మహిళా సాధికారత వంటి అంశాలపై గ్రామీణ స్థాయిలో అవగాహన పెంపొందించేందుకు సంఘమిత్ర కార్యక్రమాలు దోహదపడతాయని ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
-మహిళా సాధికారతతోనే సమాజ అభివృద్ధి: ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి -పెంచికల్‌పేటలో సంఘమిత్ర కార్యక్రమం ద్వారా సామాజిక చైతన్యం ఎల్కతుర్తి నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు):  మండలంలోని...
వేలేరులో  చెకుముకి మండలస్థాయి పరీక్షలు.
అసాంఘిక కార్యక్రమాలకు పాటు పడితే చర్యలు తప్పవు: సిపి ఎన్.శ్వేత .
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.
పీచరలో ఆగని ఇసుక దందా.. రాత్రివేళల్లో అక్రమ తరలింపు!
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే దంపతులు.
ఘనంగా మత్స్యకారుల దినోత్సవం.