రేకుర్తి అభివృద్ధికి కేఎన్ఆర్ భరోసా.త్వరలో సమ్మక్క సారలమ్మ రోడ్డు పనులు ప్రారంభం.

రేకుర్తి అభివృద్ధికి కేఎన్ఆర్ భరోసా.త్వరలో సమ్మక్క సారలమ్మ రోడ్డు పనులు ప్రారంభం.

*20వ డివిజన్‌లో మార్నింగ్ వాక్.. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై ప్రజలకు అవగాహన.*

కరీంనగర్, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):

రేకుర్తి 20వ డివిజన్‌లో సుడా మాజీ చైర్మన్ కేఎన్ఆర్ మార్నింగ్ వాక్ నిర్వహిస్తూ స్థానిక ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. గతంలో సుడా చైర్మన్‌గా ఉన్న సమయంలో మంజూరు చేసిన ప్రధానమైన సమ్మక్క సారలమ్మ రోడ్డు నిర్మాణ పనులను త్వరలో ప్రారంభిస్తామని కేఎన్ఆర్ వెల్లడించారు.

మార్నింగ్ వాక్ సందర్భంగా పలు కాలనీల్లో పర్యటించిన ఆయనకు స్థానిక ప్రజలు తమ సమస్యలను వివరించారు. ముఖ్యంగా అంతర్గత రోడ్ల నిర్మాణం, ఇతర మౌలిక సదుపాయాల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రజలు తెలిపిన సమస్యలను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేయాలని కోరారు.

స్థానిక కార్పొరేటర్ పర్వతం మల్లేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మార్నింగ్ వాక్‌లో పలు కాలనీల ముఖ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రేకుర్తి అభివృద్ధికి కేఎన్ఆర్ భరోసా.త్వరలో సమ్మక్క సారలమ్మ రోడ్డు పనులు ప్రారంభం. రేకుర్తి అభివృద్ధికి కేఎన్ఆర్ భరోసా.త్వరలో సమ్మక్క సారలమ్మ రోడ్డు పనులు ప్రారంభం.
*20వ డివిజన్‌లో మార్నింగ్ వాక్.. ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై ప్రజలకు అవగాహన.* కరీంనగర్, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు): రేకుర్తి 20వ డివిజన్‌లో సుడా మాజీ...
వెల్టూర్‌కు సింగిల్ విండో మంజూరు కావడం హర్షణీయం.
సెలవు రోజైనా ప్రజాసేవలో ముందున్న సర్పంచ్ జక్కుల మౌనిక.
మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వేలేరులో  చెకుముకి మండలస్థాయి పరీక్షలు.
అసాంఘిక కార్యక్రమాలకు పాటు పడితే చర్యలు తప్పవు: సిపి ఎన్.శ్వేత .
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.