వెల్టూర్‌కు సింగిల్ విండో మంజూరు కావడం హర్షణీయం.

వెల్టూర్‌కు సింగిల్ విండో మంజూరు కావడం హర్షణీయం.

రైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ అభినందనీయం

-- వెల్టూర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి

పెద్దమందడి,నవంబర్22(తెలంగాణ ముచ్చట్లు)

వనపర్తి నియోజకవర్గంలోని రేవల్లి, ఏదుల, సోలిపూర్, వెల్టూర్ గ్రామాలకు నూతన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సింగిల్ విండోలు) మంజూరు కావడం హర్షణీయమని వెల్టూర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి అన్నారు.ముఖ్యంగా వెల్టూర్ గ్రామానికి సింగిల్ విండో మంజూరు కావడం పట్ల ఆయన ప్రత్యేక సంతోషం వ్యక్తం చేశారు. రైతుల ఇబ్బందులను గుర్తించి, వారి సంక్షేమమే లక్ష్యంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని గ్రామానికి సింగిల్ విండోలు మంజూరు చేయించడంపై హర్షం వ్యక్తం చేశారు.సింగిల్ విండో ఏర్పాటు వల్ల వెల్టూర్‌తో పాటు పరిసర ప్రాంతాల రైతులకు వ్యవసాయ రుణాలు, ఎరువులు, విత్తనాలు తదితర వ్యవసాయ సహకార సేవలు స్థానికంగానే అందుబాటులోకి వస్తాయని తెలిపారు. దీనివల్ల రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన ఇబ్బందులు తగ్గడంతో పాటు సమయం, ప్రయాణ ఖర్చులు ఆదా అవుతాయని పేర్కొన్నారు.రైతులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం గ్రామీణ వ్యవసాయ అభివృద్ధికి ఎంతగానో దోహదపడుతుందని అన్నారు.వెల్టూర్ గ్రామానికి సింగిల్ విండో మంజూరుకు కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి వెల్టూర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వెల్టూర్‌కు సింగిల్ విండో మంజూరు కావడం హర్షణీయం. వెల్టూర్‌కు సింగిల్ విండో మంజూరు కావడం హర్షణీయం.
రైతుల సంక్షేమానికి ఎమ్మెల్యే మేఘారెడ్డి ప్రత్యేక చొరవ అభినందనీయం -- వెల్టూర్ పెద్ద శ్రీనివాస్ రెడ్డి పెద్దమందడి,నవంబర్22(తెలంగాణ ముచ్చట్లు) వనపర్తి నియోజకవర్గంలోని రేవల్లి, ఏదుల, సోలిపూర్, వెల్టూర్...
సెలవు రోజైనా ప్రజాసేవలో ముందున్న సర్పంచ్ జక్కుల మౌనిక.
మాదక ద్రవ్యాలు, సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
వేలేరులో  చెకుముకి మండలస్థాయి పరీక్షలు.
అసాంఘిక కార్యక్రమాలకు పాటు పడితే చర్యలు తప్పవు: సిపి ఎన్.శ్వేత .
నూతన వధూవరులను ఆశీర్వదించిన డా. జిల్లెల ఆదిత్య రెడ్డి.
పీచరలో ఆగని ఇసుక దందా.. రాత్రివేళల్లో అక్రమ తరలింపు!