సెలవు రోజైనా ప్రజాసేవలో ముందున్న సర్పంచ్ జక్కుల మౌనిక.
వేలేరు, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా వేలేరు మండలం మల్లికుదుర్ల గ్రామంలో సెలవు దినమైన ఆదివారం సైతం గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటూ సర్పంచ్ జక్కుల మౌనిక సంపత్ యాదవ్ ప్రజాసేవలో తన నిబద్ధతను చాటుకున్నారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం రిజిస్ట్రేషన్ కోసం గ్రామంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్‌ను సర్పంచ్ దగ్గరుండి పర్యవేక్షించారు. అర్హులైన ప్రతి కుటుంబం ఈ పథకంలో నమోదు చేసుకునేలా ప్రజలకు అవగాహన కల్పిస్తూ, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు.
సెలవు రోజైనా ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరాలనే లక్ష్యంతో పనిచేయడంపై గ్రామస్తులు సర్పంచ్‌ను అభినందించారు.
ఈ కార్యక్రమంలో సంబంధిత సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Comments