పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.

పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.

నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలి

అధికారులకు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశం

హనుమకొండ, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు): 

పరకాల మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించి, నిర్దేశించిన లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశించారు.సోమవారం హనుమకొండ జిల్లా కలెక్టరేట్‌లోని చిన్న సమావేశ మందిరంలో పరకాల మున్సిపాలిటీకి సంబంధించిన వివిధ అంశాలపై మున్సిపాలిటీ కమిషనర్ పోతరాజు పవన్, ఇతర అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పన్నుల వసూళ్ల పురోగతి, సిబ్బంది హాజరు, ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పెండింగ్ వివరాలు, ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియ తదితర అంశాలను సమీక్షించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్ల లక్ష్యాలను చేరుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సిబ్బంది విధులకు సక్రమంగా హాజరవుతున్నారా లేదా అనే అంశంపై నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించకుండా ప్రజలకు మెరుగైన సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

మున్సిపాలిటీ పరిధిలోని ప్రభుత్వ భూములను పరిరక్షించేందుకు తగిన చర్యలు చేపట్టాలని, ప్రజావాణిలో అందిన ఫిర్యాదులు, అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా త్వరితగతిన పరిష్కరించాలని స్పష్టం చేశారు. పట్టణంలో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఘన వ్యర్థాల నిర్వహణ, వ్యర్థాల శుద్ధి ప్రక్రియలో నిర్దేశిత ప్రమాణాలను పాటిస్తూ పట్టణ పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
ఈ సమీక్షా సమావేశంలో మున్సిపాలిటీ మేనేజర్ రజిత, జూనియర్ అసిస్టెంట్ అధికారి అర్షద్, సాంకేతిక అధికారి రాము, పట్టణ ప్రణాళిక పర్యవేక్షకుడు రాజ్ కుమార్, రెవెన్యూ అధికారి గిరిబాబు, వ్యవస్థల నిర్వాహకుడు సతీష్‌తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి. పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
నిర్దేశిత లక్ష్యాలను సాధించేందుకు సమష్టిగా కృషి చేయాలి అధికారులకు కలెక్టర్ చాహత్ బాజ్ పాయి ఆదేశం హనుమకొండ, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  పరకాల మున్సిపాలిటీ పరిధిలో...
జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.
ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం.. రాష్ట్రానికి ఆయన పాలనే శ్రీరామరక్ష.
రాకేష్ అన్నను విజయతీరాలకు చేర్చు మణికంఠా!
కన్నీటి కుటుంబానికి గ్రామపంచాయతీ చేయూత.
పోతిరెడ్డిపల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.