కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం.. రాష్ట్రానికి ఆయన పాలనే శ్రీరామరక్ష.
*దీక్షా దివస్ సభకు వేలాదిగా తరలిరావాలి.. విజయవంతం చేయాలి: జీవన్ రెడ్డి*
చొప్పదండి, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణం కేసీఆర్‌తోనే సాధ్యమని, రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, చొప్పదండి నియోజకవర్గ ఇన్‌చార్జి తాటిపర్తి జీవన్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కాలం తెచ్చినవి కావని, కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువని విమర్శించారు. నవంబర్ 29న కరీంనగర్‌లో నిర్వహించనున్న దీక్షా దివస్ సభకు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని బీఆర్ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
చొప్పదండి నియోజకవర్గంలోని గంగాధర, బోయినపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన దీక్షా దివస్ సన్నాహక సమావేశానికి తాటిపర్తి జీవన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నవంబర్ 29న కరీంనగర్‌లో జరగనున్న దీక్షా దివస్ సభ ఏర్పాట్లు, విజయవంతానికి చేపట్టాల్సిన కార్యాచరణపై నాయకులతో చర్చించారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, కొత్త జైపాల్ రెడ్డి తదితర నాయకులు తాటిపర్తి జీవన్ రెడ్డికి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో గంగాధర, బోయినపల్లి మండలాల స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments