కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ వేలం పూర్తి.

కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ వేలం పూర్తి.

కొత్తకొండ వీరభద్ర స్వామి ఆలయ షాపింగ్ కాంప్లెక్స్ వేలం పూర్తి

రూ.8,100తో షాపు నంబర్ 14ను దక్కించుకున్న కే. వెంకటస్వామి

మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్న షాపుల లీజు

కొత్తకొండ  ,తెలంగాణ ముచ్చట్లు  :శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానానికి సంబంధించిన షాపింగ్ కాంప్లెక్స్ షాపుల లీజు హక్కుల కోసం సోమవారం నిర్వహించిన టెండర్ కమ్ బహిరంగ వేలం ప్రక్రియలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. పోటాపోటీగా సాగిన వేలం పాటలో మొత్తం 14 షాపులకు లీజుదారులను ఎంపిక చేశారు.

వేలంలో షాపు నంబర్ 1ను చింత రాజు రూ.3,400కు, షాపు నంబర్ 2ను ఎం. అనిల్ కుమార్ రూ.3,600కు, షాపు నంబర్ 3ను జి. లక్ష్మణ్ రూ.3,400కు, షాపు నంబర్ 4ను వై. శ్రీనివాస్ రూ.3,400కు దక్కించుకున్నారు.

అదేవిధంగా షాపు నంబర్ 5ను చింత రాజు రూ.6,600కు, షాపు నంబర్ 6ను వై. రవీందర్ రూ.3,600కు, షాపు నంబర్ 7ను టీ. తిరుపతి రూ.5,700కు, షాపు నంబర్ 8ను జి. సతీష్ రూ.5,700కు, షాపు నంబర్ 9ను జి. సతీష్ రూ.5,600కు, షాపు నంబర్ 10ను కే. సుమలత రూ.5,000కు, షాపు నంబర్ 11ను చి. రాజు రూ.5,700కు దక్కించుకున్నారు.

షాపు నంబర్ 13ను జె. కిషన్ రూ.7,000కు, షాపు నంబర్ 14ను కే. వెంకటస్వామి రూ.8,100కు, షాపు నంబర్ 15ను కే. వెంకటస్వామి రూ.4,700కు వేలం పాటలో పొందారు. వీరిలో షాపు నంబర్ 14కు అత్యధిక ధర పలికింది.

ఈ మూడింటి వేలం వాయిదా

షాపు నంబర్ 12కు ఎవరూ వేలంలో పాల్గొనకపోవడంతో పాటు, పచ్చి కొబ్బరి, ముక్కలు, చీరలు, బియ్యం, కణుములు సేకరణ హక్కులు, పుట్నాలు, ప్యాలాల సేకరణ హక్కులకు కూడా పాటాదారులు హాజరుకాకపోవడంతో ఆయా వేలం ప్రక్రియలను నవంబర్ 30, 2026వ తేదీకి వాయిదా వేశారు.

షాపుల లీజు హక్కులు 2027 జనవరి 1 నుంచి 2029 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉండనున్నాయి.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.
మేడ్చల్,నవంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్రంలోని జర్నలిస్టులకు శాశ్వత సామాజిక భద్రత కల్పించడంతో పాటు, పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక జర్నలిస్టు పింఛన్, సంక్షేమ...
ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం.. రాష్ట్రానికి ఆయన పాలనే శ్రీరామరక్ష.
రాకేష్ అన్నను విజయతీరాలకు చేర్చు మణికంఠా!
కన్నీటి కుటుంబానికి గ్రామపంచాయతీ చేయూత.
పోతిరెడ్డిపల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా భరోసా.