ప్రతి కుటుంబానికి అండగా ఇందిరమ్మ బీమా పథకం.

కొమ్ము వెంకటస్వామి, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.

ప్రతి కుటుంబానికి అండగా ఇందిరమ్మ బీమా పథకం.

పెద్దమందడి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో ఇందిరమ్మ బీమా పథకాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామి ఆధ్వర్యంలో ప్రారంభించారు.ఈ సందర్భంగా కొమ్ము వెంకటస్వామి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని, ప్రతి కుటుంబానికి ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా ఇందిరమ్మ బీమా పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. కుటుంబంలో అనుకోని ఆపద ఎదురైనప్పుడు బాధిత కుటుంబాలకు ఈ పథకం ఎంతో అండగా నిలుస్తుందని పేర్కొన్నారు.ప్రజల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని, ఇందిరమ్మ బీమా పథకంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని, అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అశోక్, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, వడ్డే శేఖర్, ఆర్. పెద్ద శ్రీనివాస్ రెడ్డి, చందు రెడ్డి, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి వెంకటస్వామి, ఆశా వర్కర్లు, మహిళలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి. జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.
మేడ్చల్,నవంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు): రాష్ట్రంలోని జర్నలిస్టులకు శాశ్వత సామాజిక భద్రత కల్పించడంతో పాటు, పదవీ విరమణ అనంతరం ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక జర్నలిస్టు పింఛన్, సంక్షేమ...
ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.
కేసీఆర్‌తోనే తెలంగాణ పునర్నిర్మాణం సాధ్యం.. రాష్ట్రానికి ఆయన పాలనే శ్రీరామరక్ష.
రాకేష్ అన్నను విజయతీరాలకు చేర్చు మణికంఠా!
కన్నీటి కుటుంబానికి గ్రామపంచాయతీ చేయూత.
పోతిరెడ్డిపల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.
రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా భరోసా.