పోతిరెడ్డిపల్లిలో కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు.
* ఉపసర్పంచ్ రాపర్తి సంధ్య–కొంరయ్యతో పాటు వార్డు సభ్యులు, గౌడ సంఘం ప్రతినిధుల చేరిక
* కండువాలు కప్పి ఆహ్వానించిన హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్
వీణవంక, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):
కరీంనగర్ జిల్లా వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీణవంక మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రఘుపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ రాపర్తి సంధ్య–కొంరయ్య, వార్డు సభ్యురాలు పుష్పలీల, గౌడ సంఘం సొసైటీ ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రాజుతో పాటు నాగిళ్ల సూర్యం, సయ్యద్, ఖలీం, రాపర్తి నితీష్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి వొడితల ప్రణవ్ వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలైన ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీ, నూతన పెన్షన్లు, ఉచిత విద్యుత్ తదితర పథకాల పట్ల ఆకర్షితులై, వొడితల ప్రణవ్ నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.
అనంతరం వొడితల ప్రణవ్ మాట్లాడుతూ ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు అర్హులైన వారికి నూతన పెన్షన్లు, ఇందిరా కుటుంబ జీవిత బీమా వంటి పథకాలను అందిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ చేరవేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు.
ఈ కార్యక్రమంలో వీణవంక మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments