వైద్య పరికరాలున్నా.. పేదలకు అందని వైద్యం.
కొమ్ము చెన్నకేశవులు, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు.
వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నప్పటికీ, నిపుణులైన వైద్యులు, వైద్య సిబ్బంది కొరత కారణంగా పేద ప్రజలకు పూర్తిస్థాయిలో వైద్య సేవలు అందడం లేదని ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రజాధనంతో కొనుగోలు చేసిన విలువైన వైద్య పరికరాలు నిరుపయోగంగా ఉండటం బాధాకరమని, వాటిని పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురాకపోవడం వల్ల పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందడం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులు పేద ప్రజలకు ప్రాణాధారంగా ఉండాల్సి ఉండగా, వైద్యులు, నిపుణులైన సిబ్బంది కొరతతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోందని, దీంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఈ సమస్యపై తక్షణమే స్పందించి ఆసుపత్రిలో అందుబాటులో ఉన్న వైద్య పరికరాలను పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలని, అవసరమైన నిపుణులైన వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించి పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు ఎమ్మార్పీఎస్ తరఫున జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ వనపర్తి జిల్లా అధ్యక్షుడు కొమ్ము చెన్నకేశవులు మాదిగ, మహనీయుల ఉత్సవ కమిటీ చైర్మన్ గంధం నాగరాజు మాదిగ, ఎంఎస్ఎఫ్ వనపర్తి కో-ఇన్‌చార్జి పుట్టపాక అజయ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.


Comments