అక్రమంగా మొరం తరలిస్తున్న ట్రాక్టర్ పట్టివేత  ఇద్దరిపై కేసు నమోదు.

వేలేరు నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు ):

హనుమకొండ జిల్లా వేలేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పీచర గ్రామంలో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్న ట్రాక్టర్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది మహీంద్రా  ద్వారా అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నట్లు గుర్తించారు.
విచారణలో ట్రాక్టర్ డ్రైవర్, పీచర గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. లింగం బండ సమీపంలోని కాలువ వద్ద ఉన్న మట్టిని అదే గ్రామానికి చెందిన జేసీబీ సహాయంతో గ్రావెల్ లోడ్ చేసి, అధిక ధరలకు విక్రయించేందుకు తరలిస్తున్నట్లు వెల్లడైంది.
దీంతో పోలీసులు ట్రాక్టర్‌తో పాటు గ్రావెల్‌ను స్వాధీనం చేసుకొని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ అక్రమ రవాణాలో సంబంధం ఉన్న జేసీబీ యజమాని పరారిలో   ఉన్నట్లు తెలిపారు.
ఈ ఘటనపై ఇరువురిపై   ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు): హైదరాబాద్‌లోని మియాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నమందడి గ్రామానికి చెందిన జనిగే భరత్ మృతి చెందడంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్ర...
మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..
హకీంపేటలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పై కలెక్టర్ సమీక్ష.
జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.
ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.