రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా భరోసా.

రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి బీమా భరోసా.

* ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాపై అవగాహన కల్పించిన మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్

జమ్మికుంట, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని అర్హులైన ప్రతి కుటుంబం సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ సూచించారు. జమ్మికుంట పట్టణంలోని 12వ వార్డులో నిర్వహించిన ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణ పరిధిలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబం ఈ పథకంలో తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని తెలిపారు. నమోదు ప్రక్రియకు రేషన్ కార్డు, ఫోన్ నంబర్ అవసరమని పేర్కొన్నారు. ప్రజలు తమ తమ వార్డుల్లోని వార్డు అధికారులను సంప్రదించి బీమా పథకానికి సంబంధించిన వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. అర్హులైన కుటుంబాలన్నీ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ చుంచు రమాదేవి, చుంచు శివ, విజయ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కరాటే పోటీల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థి. కరాటే పోటీల్లో సత్తా చాటిన నారాయణ విద్యార్థి.
- ఆల్ ఇండియా ఛాంపియన్‌షిప్‌–2026లో మట్టా స్వామి గౌడ్‌ ప్రతిభ. - అభినందించిన పాఠశాల యాజమాన్యం. సత్తుపల్లి, నవంబరు 23 (తెలంగాణ ముచ్చట్లు):  ఆల్ ఇండియా కరాటే...
గ్రానైట్ మాఫియాపై బీజేపీ మౌనం ఎందుకు?
మానేరు కట్ట అభివృద్ధికి కెఎన్ఆర్ కృషి.
భక్తిపారవశ్యంలో వల్లభాపురం శివాలయం.. కార్తీక పౌర్ణమికి అర్చకుల ప్రత్యేక ఏర్పాట్లు!
కాంగ్రెస్ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం.
వైద్య పరికరాలున్నా.. పేదలకు అందని వైద్యం.