భక్తిపారవశ్యంలో వల్లభాపురం శివాలయం.. కార్తీక పౌర్ణమికి అర్చకుల ప్రత్యేక ఏర్పాట్లు!

సామూహిక రుద్రాభిషేకం, సాయంత్రం దీపోత్సవం, ఆకాశదీప కార్యక్రమాలు

భక్తిపారవశ్యంలో వల్లభాపురం శివాలయం.. కార్తీక పౌర్ణమికి అర్చకుల ప్రత్యేక ఏర్పాట్లు!

ఎల్కతుర్తి నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు): 

హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థాన శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలకు సర్వం సిద్ధమైంది. పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం ఆలయంలో ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, అర్చకులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

ఈ సందర్భంగా వీరశైవ జంగమ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆలయ అర్చకులు శివశ్రీ సదా నిరంజన్ సిద్ధాంతి మాట్లాడుతూ.. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి స్వామివారికి సామూహిక పంచామృత సహిత రుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భక్తుల భాగస్వామ్యంతో సహస్ర బిల్వార్చన నిర్వహిస్తామని, పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ ఉంటుందని వెల్లడించారు.

అలాగే సాయంత్రం 6 గంటల నుంచి కార్తీక దీపోత్సవ వేడుకలు ప్రారంభమవుతాయని, ఈ సందర్భంగా లింగార్చన, ఆకాశదీప కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించనున్నట్లు వివరించారు.

కార్తీక పౌర్ణమి పర్వదినానికి శివారాధనలో విశేష ప్రాధాన్యత ఉందని, ఈ పవిత్ర రోజున పశుపతినాథుడిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొనడం భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు.

కార్తీక పౌర్ణమి సందర్భంగా నిర్వహించే ప్రత్యేక పూజలు, దీపోత్సవ వేడుకలకు భక్తులందరూ కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో హాజరై స్వామివారి సంపూర్ణ అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆలయ కమిటీ, అర్చకులు శివశ్రీసదా నిరంజన్ సిద్ధాంతి కోరారు.IMG-20261123-WA0041

Tags:

Post Your Comments

Comments

Latest News

భక్తిపారవశ్యంలో వల్లభాపురం శివాలయం.. కార్తీక పౌర్ణమికి అర్చకుల ప్రత్యేక ఏర్పాట్లు! భక్తిపారవశ్యంలో వల్లభాపురం శివాలయం.. కార్తీక పౌర్ణమికి అర్చకుల ప్రత్యేక ఏర్పాట్లు!
ఎల్కతుర్తి నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):  హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వల్లభాపురం గ్రామంలోని శ్రీ పశుపతినాథ్ దేవస్థాన శివాలయంలో కార్తీక పౌర్ణమి వేడుకలకు సర్వం సిద్ధమైంది....
కాంగ్రెస్ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం.
వైద్య పరికరాలున్నా.. పేదలకు అందని వైద్యం.
ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం.
అభివృద్ధి ఎక్కడంటూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ గౌడ్!
పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక.