కాంగ్రెస్ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!

కాంగ్రెస్ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!

కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం 

-400 మందికి పైగా నాయకులు, కార్యకర్తల తరలింపు

ఎల్కతుర్తి నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు): 

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు, ప్రచారాల నేపథ్యంలో ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా కరీంనగర్‌లో నిర్వహించిన మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో సుమారు 400 మందికి పైగా పార్టీ శ్రేణులు తరలివెళ్లి తమ భాగస్వామ్యాన్ని చాటుకున్నారు.

కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మహా పాదయాత్రకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజల్లో అవగాహన కల్పించడం, ఎన్నికల వ్యవస్థపై వస్తున్న ఆరోపణలు, అపోహలపై ప్రజలకు వివరణ ఇవ్వడం ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని పార్టీ నాయకులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వానికి యువతతో పాటు ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు మంతుర్తి శ్రీకాంత్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ కార్యకర్తలు భయపడే ప్రసక్తే లేదని, ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో సరైన అవగాహన కల్పించేందుకు పార్టీ శ్రేణులు నిరంతరం కృషి చేస్తాయని తెలిపారు.

ఎల్కతుర్తి మండలం నుంచి సుమారు 400 మందికి పైగా నాయకులు, కార్యకర్తలు మహా పాదయాత్రలో పాల్గొనడం పార్టీ శ్రేణుల ఐక్యతకు, క్రమశిక్షణకు నిదర్శనమని పేర్కొన్నారు. కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన గ్రామ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, యువ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కాంగ్రెస్ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం! కాంగ్రెస్ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!
కరీంనగర్ మహా పాదయాత్రలో ఎల్కతుర్తి మండల బీజేపీ శ్రేణుల భారీ భాగస్వామ్యం  -400 మందికి పైగా నాయకులు, కార్యకర్తల తరలింపు ఎల్కతుర్తి నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):...
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం.
వైద్య పరికరాలున్నా.. పేదలకు అందని వైద్యం.
ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం.
అభివృద్ధి ఎక్కడంటూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ గౌడ్!
పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక.
అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.