పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక.

పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక.

పెద్దమందడి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

పట్టుదల, కృషి ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన వడ్ల మౌనిక చారి. న్యాయవాదిగా తన లక్ష్యాన్ని సాధించి గ్రామానికి గుర్తింపు తీసుకొచ్చారు.మౌనిక చారి హైదరాబాద్ హైకోర్టులో అడ్వకేట్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో తన పేరు నమోదు చేసుకొని వనపర్తి కోర్టులో న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. న్యాయ విద్యలో ప్రతిభ కనబరిచిన ఆమె వనపర్తిలోని ఎస్‌డీఎం లా కాలేజీలో టాపర్‌గా నిలవడం విశేషం.గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చి కష్టపడి చదువుకుని న్యాయవాదిగా ఎదగడం పట్ల కుటుంబ సభ్యులు, బలిజపల్లి గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆమె సాధించిన విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.ఈ సందర్భంగా మౌనిక చారి మాట్లాడుతూ తన భర్త శ్రీశైలం చారి (పోలీస్ కానిస్టేబుల్) అందించిన ప్రోత్సాహం, సహకారం వల్లే ఈ స్థాయికి చేరుకోగలిగానని సంతోషం వ్యక్తం చేశారు. తన విజయానికి భర్త ప్రోత్సాహం ఎంతో దోహదపడిందని తెలిపారు.గ్రామీణ ప్రాంతానికి చెందిన మహిళ న్యాయవాదిగా ఎదిగి వనపర్తి కోర్టులో బాధ్యతలు చేపట్టడం స్థానికంగా పలువురికి స్ఫూర్తినిస్తోంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక. పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక.
పెద్దమందడి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు): పట్టుదల, కృషి ఉంటే గ్రామీణ ప్రాంతాల నుంచి కూడా ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని నిరూపించారు వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం బలిజపల్లి గ్రామానికి చెందిన...
అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.
44వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమాపై విస్తృత ఇంటింటి ప్రచారం.
ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.
మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..
హకీంపేటలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పై కలెక్టర్ సమీక్ష.