ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం.

ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం.

*టీజేఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ*

*రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలి...*

*420 హామీలతో గద్దెనెక్కి మోసం చేస్తే ఊరుకునేదిలేదు*

*టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) సంతకాల సేకరణ ఉద్యమంలో బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఫైర్*

ఖమ్మం బ్యూరో , నవంబర్ 23(తెలంగాణ ముచ్చట్లు )

రాష్ట్రంలోని అర్హులైన ప్రతీ ఒక్క జర్నలిస్టుకూ ఇంటి స్థలం దక్కేవరకూ బీఆర్ ఎస్ అండగా ఉంటుందనీ, ప్రభుత్వం వెంటనే స్పందించి ఖమ్మంలో  గతంలో బీఆర్ ఎస్ ప్రభుత్వం కేటాయించిన 23.2 ఎకరాల భూమిని వెంటనే జర్నలిస్టులకు పంపిణీ చేయాలనీ, లేకపోతే తాము జర్నలిస్టుల ఉద్యమంలో కలిసి పోరాడుతామని బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రాజ్యసభ ఫ్లోర్‌లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులుండి కూడా వెయ్యి మంది ఉన్న జర్నలిస్టులకు న్యాయబద్దంగా దక్కాల్సిన ఇండ్ల స్థలాలను పంపిణీ చేయడంలో తాత్సారం చేయడం సరికాదన్నారు. ఖమ్మం జిల్లాలో అర్హులైన ప్రతీ జర్నలిస్టుకూ గత ప్రభుత్వం కేటాయించిన భూమిని పంపిణీ చేయాలంటూ టీయూ డబ్ల్యూజే(టీజేఎఫ్) సంతకాల సేకరణ కార్యక్రమం సోమవారం అమరవీరుల స్తూపం వద్ద నిర్వహించారు.  ఈ కార్యక్రమానికి స్వయంగా వచ్చి మద్దతు తెలిపిన ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ...అమరవీరుల స్తూపం సాక్షింగా ఆందోళన చేస్తున్న టీయయూ డబ్ల్యూజే(టీజేఎఫ్) ఉద్యమం పూర్తిగా చట్టబద్దమైంది, న్యాయమైందన్నారు. ప్రభుత్వం ఏర్పడి మూడేండ్లు అవుతున్నా జర్నలిస్టులకు ఇస్తానన్న భూమిని ఇవ్వకుండా మోసం చేయడం ఎంతవరకు న్యాయమో ముగ్గురు మంత్రులు గుర్తించాలన్నారు. 2023 జనవరి 19న ఖమ్మం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలకు సంబంధించిన జీఓ తీసుకురావడంలో నాడు మంత్రి కేటీఆర్‌తో ప్రత్యేకంగా మాట్లాడి జీఓ రద్దుకాకుండా చేశామని ఎంపీ గుర్తుచేశారు. ఆ జీఓ ఫలితంగానే స్థల సేకరణ పూర్తయిందన్నారు. 
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలి...
420 హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ చివరికి జర్నలిస్టులకు ఇస్తానన్న ఇండ్ల స్థలం పంపిణీ చేయడంలో జర్నలిస్టులను కూడా మోసం చేసిందని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1800మంది జర్నలిస్టులు ఉన్నారనీ, రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 44వేల మంది జర్నలిస్టులున్నారనీ వారందరికీ ఒకొక్కరికి 150 గజాల స్థలం ఇచ్చినా మొత్తం కలిపి 1375 ఎకరాలు కేటాయించి పంపిణీ చేస్తే సరిపోతుందన్నారు. అదికూడా దశలవారీగా ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం కేటాయిస్తే వారికి న్యాయం జరుగుతుందన్నారు. ముఖ్యంగా ఖమ్మం జిల్లాలోని జర్నలిస్టులకు 2023 జనవరి 19న జీఓ నెంబర్ 147 ద్వారా కేటాయించిన భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు పంపిణీ చేయడంలేదో సమాధానం చెప్పాలని ఎంపీ వద్దిరాజు ప్రశ్నించారు. బీఆరఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్‌గా జర్నలిస్టులకు ఇండ్ల స్థలం దక్కేవరకూ పోరాడుతానని అన్నారు. 

*ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఇండ్ల స్థలాలు పంపిణీ చేయాలి..*

 టీయూ డబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఆకుతోట ఆదినారాయణ, చిర్రా రవి మాట్లాడుతూ..జర్నలిస్టులకు కేటాయించిన భూమిని ఇకనైనా ప్రభుత్వం స్పందించి పంపిణీ చేయాలని జర్నలిస్టులకు అండగా నిలవాలని కోరారు. ఇండ్ల స్థలాలు దక్కేవరకూ దశలవారీ పోరాటాలు కొనసాగుతాయని వారు అన్నారు. IMG-20261123-WA0073

*టీజేఎఫ్ నిరసనకు అనూహ్య స్పందన..*

ఖమ్మంలో సోమవారం టీజేఎఫ్ నిర్వహించిన సంతకాల సేకరణ ఉద్యమానికి జిల్లా కేంద్రంలో అనూహ్య స్పందన లభించింది. ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖుల నుండి అనూహ్య స్పందన లభించింది. ముఖ్యంగా న్యాయవాదులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు, వైద్యులు, వివిధ సామాజిక సంఘాల ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, యువజన, విద్యార్థి, మహిళా సంఘాలు పెద్ద ఎత్తున వందలాదిగా తరలివచ్చి తమ సంఘీభావం తెలిపారు.టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) ఖమ్మం జిల్లా కమిటీ నిర్వహిస్తున్న ఆందోళనలు న్యాయమైన డిమాండ్లు అని వారు అన్నారు. టీజేఎఫ్‌కు తమ సంపూర్ణమైన మద్దతు ఉంటుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో  మున్నూరుకాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల గాంధీ, జిల్లా అధ్యక్షులు శీలంశెట్టి వీరభద్రం, టీజీవో జిల్లా అధ్యక్షులు కొంగర వెంకటేశ్వర రావు, కార్యదర్శి మోదుగు వేలాద్రి, టీ ఎన్ జీ ఓ స్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుంటుపల్లి శ్రీనివాస్, బుల్లెట్ శ్రీను, హాస్టల్ వార్డెన్ల సంఘం జిల్లా అధ్యక్షులు కోటపాటి రుక్మారావు, మహిళా నాయకురాలు కోమలి, 
హై కోర్టు న్యాయవాది నలమాస కృష్ణ గౌడ్, తెలంగాణ పబ్లికేషన్ అధినేత  కోయ చంద్రమోహన్, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ డా గోంగూర వెంకటేశ్వర్లు, ప్రముఖ న్యూరో వైద్యులు డా. జీ వీ మురళి, సాయిరాం గ్యాస్ట్రో హాస్పిటల్ అధినేత డా జంగాల సునీల్ కుమార్,  సీసీఏ ప్రతినిధులు స్పర్శ భాస్కర్, దేవిరెడ్డి విజయ్, డా.బీఆర్ అంబేద్కర్ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు లింగాల రవికుమార్, పీడీఎస్‌యూ నేతలు మస్తాన్, లక్ష్మణ్, పీవైఎల్ నేతలు భరత్, కార్మిక సంఘాల నేతలు మోహన్‌రావు, బీఆర్ ఎస్ నేత గౌస్ పాషా, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు మేరుగు వెంకటరమణ, గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అమర గాని వెంకన్న గౌడ్, మాలమహానాడు రాష్ట్రనాయకులు గుంతేటి వీరభద్రం, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు బానోత్ భద్రూనాయక్, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు నరేందర్, జంపాల ఈశ్వర్, టీయూసిఐ నేత రామయ్య, గాయకుడు రాము, జర్నలిస్టు యూనియన్ జిల్లా నాయకుడు కల్యాణ్ చక్రవర్తి, టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) జాతీయ కౌన్సిల్ సభ్యులు వెన్నబోయిన సాంబశివరావు ,రాష్ట్ర కమిటీ సభ్యులు బొల్లం శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు జి. ప్రశాంత్‌రెడ్డి ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి రజనీకాంత్, వనం నాగయ్య, కలువకొలను హరీశ్, దుంపల భాస్కర్, రాజ్ న్యూస్ ఉపేందర్,మందుల ఉపేందర్, , శ్రీధర్ శర్మ, వీ5 కేవీ, మోహన్, ఉపేందర్, నగర ప్రధాన కార్యదర్శి అమరవపు కోటేశ్వరరావు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు గుద్దేటి రమేష్‌బాబు, కోశాధికారి బిక్కి గోపి, ఎలక్ట్రానిక్ ఖమ్మం నగర అధ్యక్షులు యలమందల జగదీష్, కరీష అశోక్, కల్యాణ్, సాయి, సంపత్, నాగేశ్వరరావు, సుధాకర్,సతీష్, కెమెరామెన్ల సంఘం నాయకులు రాజు, నాగరాజు, జక్కుల వెంకటరమణ, ఆర్ టి వి శేఖర్, నాగేశ్వరరావు, సతీష్, ముత్యాల కోటేశ్వరరావు,పానకాలరావు, జీవన్ రెడ్డి ,పులి శీను, ఉత్కంఠం శ్రీనివాస్, రేపాక యాదగిరి, హుస్సేన్, బోనగిరి యాదగిరి, ఇసంపల్లి వెంకటేశ్వర్లు, అప్పారావు కూరపాటి నరేష్, ఉల్లోజు రమేష్, గౌరీ శంకర్, రామకృష్ణ, నాగ శేఖర్ ,నాగేశ్వరరావు,ఐ ఎన్ బి రమేష్ , కెమెరామెన్ శ్రీనివాస్ ,పొదిలి నర్సింహారావు, పాశం వెంకటేశ్వర్లు, మహిళా జర్నలిస్టులు రోజా, కిరణ్మయి, మాధవి, శ్రీదేవి, సంగమేశ్వర ప్రసాద్,  మగినం శివకృష్ణ, గణేష్,  పెంటి వెంకటేశ్వర్లు, రవి, లింగయ్య, శంకర్ , వెంకన్న, శ్రీను ,తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం. ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం.
*టీజేఎఫ్ ఆధ్వర్యంలో సంతకాల సేకరణ* *రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ ఇంటి స్థలం ఇవ్వాలి...* *420 హామీలతో గద్దెనెక్కి మోసం చేస్తే ఊరుకునేదిలేదు* *టీయూడబ్ల్యూజే(టీజేఎఫ్) సంతకాల...
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.
మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..
హకీంపేటలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పై కలెక్టర్ సమీక్ష.
జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.