మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.

వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్‌లోని మియాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నమందడి గ్రామానికి చెందిన జనిగే భరత్ మృతి చెందడంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బీటెక్ పూర్తి చేసిన భరత్ గత మూడు నెలలుగా సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. విధులకు వెళ్తున్న సమయంలో బస్సు ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.భరత్ మృతి విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి చిన్నమందడి గ్రామానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, వారికి మనోధైర్యం కల్పించారు. తక్షణ సహాయంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ భర్త వెంకటస్వామి, ఉపసర్పంచ్ వాకిటి రవి, నాగేంద్రం యాదవ్ కాంగ్రెస్ కార్యకర్తలు జనిగే బాలకృష్ణ, సుఖ మన్నెం, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి. మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.
వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు): హైదరాబాద్‌లోని మియాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నమందడి గ్రామానికి చెందిన జనిగే భరత్ మృతి చెందడంపై వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తీవ్ర...
మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..
హకీంపేటలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పై కలెక్టర్ సమీక్ష.
జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.
జర్నలిస్టులకు ప్రత్యేక పెన్షన్, సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలి.
ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.