ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి.

ప్రజావాణి అర్జీలను తక్షణమే పరిష్కరించాలి.

మేడ్చల్ మల్కాజిగిరి,నవంబర్23 (తెలంగాణ ముచ్చట్లు):

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుండి వచ్చిన అర్జీలను ఏమాత్రం ఆలస్యం చేయకుండా నిబంధనల ప్రకారం వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఫైజాన్ అహ్మద్,  విజయేందర్ రెడ్డిలతో కలిసి కలెక్టర్ అర్జీదారుల నుండి వినతులను స్వీకరించారు. ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ, హౌజింగ్, పంచాయతీ రాజ్, సివిల్ సప్లైస్, మున్సిపల్ తదితర శాఖలకు సంబంధించి మొత్తం 123 దరఖాస్తులు ప్రజల నుండి స్వీకరించినట్లు అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన బాధితుల సమస్యలకు ప్రాధాన్యతనిచ్చి వేగంగా పరిష్కారం చూపాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల  వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టరు సూచించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ మాలతి,  వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

44వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమాపై విస్తృత ఇంటింటి ప్రచారం. 44వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమాపై విస్తృత ఇంటింటి ప్రచారం.
*ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి కుటుంబానికి చేరవేయడమే నా లక్ష్యం* *ప్రజల సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం పనిచేస్తా కాంగ్రెస్ నాయకులు గుడిపూడి జగదీష్* ఖమ్మం బ్యూరో...
ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.
మంత్రి పొంగులేటి చొరవతో,గోళ్లపాడుకు కొత్త సొసైటీ..
హకీంపేటలో 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పై కలెక్టర్ సమీక్ష.
జర్నలిస్ట్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తా.
పన్నుల వసూళ్లపై ప్రత్యేక దృష్టి సారించాలి.