అభివృద్ధి ఎక్కడంటూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ గౌడ్!

అభివృద్ధి ఎక్కడంటూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ గౌడ్!

హామీలు ఏమయ్యాయి? గ్రామానికి చేసిన అభివృద్ధి ఏదంటూ ప్రశ్నల వర్షం

రూ.1,800 కోట్ల అభివృద్ధి నిధులపై నిలదీత.. 

ఇందిరమ్మ భీమా ప్రారంభోత్సవంలో వాగ్వాదం.. ఉద్రిక్త వాతావరణం

జఫర్‌గఢ్,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు): 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? గ్రామానికి చేసిన అభివృద్ధి ఎక్కడ? నియోజకవర్గానికి రూ.1,800 కోట్లు తీసుకొచ్చామని చెబుతున్న మీరు.. ఆ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులేమిటో ప్రజలకు వివరించాలని స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు నాయిని నరేష్ గౌడ్ నిలదీశారు. సోమవారం ఉప్పుగల్ గ్రామంలో జరిగిన ఇందిరమ్మ భీమా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొన్న సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ నాయిని ప్రశ్నించడంతో కార్యక్రమంలో వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

గత శాసనసభ ఎన్నికల సమయంలో ఉప్పుగల్ గ్రామాభివృద్ధికి ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనేక హామీలు ఇచ్చారని, మూడేళ్లు గడుస్తున్నా వాటిలో చాలా వరకు నెరవేరలేదని నాయిని నరేష్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పుగల్ నుంచి రఘునాథపల్లికి వెళ్లే రహదారి పనులు ఇప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. నష్కల్ వరకు బీటీ రోడ్డు నిర్మిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని, పెద్ద చెరువులోకి సాగునీరు చేరేందుకు శాశ్వత పరిష్కారం ఎందుకు చూపడం లేదని నిలదీశారు.

15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు మినహా రాష్ట్ర ఆర్థిక సంఘం నుంచి గ్రామానికి ఒక్క రూపాయి కూడా రాలేదని ఆయన ఆరోపించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,800 కోట్లు నిధులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే చెబుతున్నప్పటికీ, గ్రామంలో కనీస మౌలిక సదుపాయాల కల్పనలోనే నిర్లక్ష్యం కనిపిస్తోందని విమర్శించారు. కోట్లాది రూపాయల నిధులు తెచ్చినట్లు ప్రచారం చేసుకోవడం కాకుండా, గ్రామానికి జరిగిన అభివృద్ధి ఏమిటో ప్రజలకు చూపించాలని డిమాండ్ చేశారు.

ఈ సందర్భంగా తాను గ్రామ సమస్యలను ప్రస్తావిస్తూ ప్రశ్నిస్తుండగా స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తనపై దాడికి ప్రయత్నించారని నాయిని నరేష్ గౌడ్ ఆరోపించారు. దీంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పరిస్థితిని గమనించిన గ్రామ మహిళలు జోక్యం చేసుకుని వారిని అడ్డుకున్నారని, ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారని తెలిపారు.

ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అడగడం తప్పా? గ్రామ సమస్యలపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి దాడులకు ప్రయత్నించడం ఎంతవరకు సమంజసమని గ్రామస్తులు ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలను ప్రశ్నించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, ప్రశ్నించే గొంతుకలను అణచివేయాలని చూడటం సరికాదని పేర్కొన్నారు.

ఉప్పుగల్ గ్రామానికి ఇచ్చిన హామీల అమలుపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టమైన సమాధానం చెప్పాలని, పెండింగ్‌లో ఉన్న రహదారి, సబ్‌స్టేషన్ రోడ్డు, సాగునీటి సమస్యలను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. రూ.1,800 కోట్ల నిధుల వినియోగంపై కూడా స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. గ్రామాభివృద్ధి విషయంలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని, సమస్యలు పరిష్కారమయ్యే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని నాయిని నరేష్ గౌడ్ స్పష్టం చేశారు.IMG-20261123-WA0075IMG-20261123-WA0076

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం. ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం.
వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాల ప్రజలకు శుభవార్త. గతంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సౌకర్యం వనపర్తి శాసనసభ్యులు తుడి...
అభివృద్ధి ఎక్కడంటూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ గౌడ్!
పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక.
అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.
44వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమాపై విస్తృత ఇంటింటి ప్రచారం.
ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.