ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం.

మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేర్పు.

ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం.

వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాల ప్రజలకు శుభవార్త. గతంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సౌకర్యం వనపర్తి శాసనసభ్యులు తుడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ, సహకారంతో తిరిగి పునఃప్రారంభమైంది. దీంతో మూడు గ్రామాల ప్రజల చిరకాల కోరిక నెరవేరడంతో పాటు గ్రామస్తుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.బస్సు సౌకర్యం పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, ఉద్యోగులు, మహిళలు, వృద్ధులు సహా గ్రామ ప్రజలకు ప్రయాణ కష్టాలు తొలగనున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్యం, ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం పట్టణాలకు వెళ్లే వారికి ఈ బస్సు సౌకర్యం ఎంతో ఉపయోగకరంగా ఉండనుంది. గతంలో బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలకు తిరిగి ఆర్టీసీ బస్సు అందుబాటులోకి రావడం ఎంతో ఊరటనిచ్చింది.గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి, ప్రజల రవాణా అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ బస్సు సౌకర్యం పునరుద్ధరణకు ప్రత్యేక చొరవ చూపిన ఎమ్మెల్యే తుడి మేఘారెడ్డికి మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి స్పందించి రవాణా సౌకర్యాన్ని తిరిగి అందుబాటులోకి తీసుకురావడంపై హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాల సర్పంచులు, గ్రామ పెద్దలు, యువకులు మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం. ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం.
వనపర్తి,నవంబర్23(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల, మద్దిగట్ల, అమ్మపల్లి గ్రామాల ప్రజలకు శుభవార్త. గతంలో నిలిచిపోయిన ఆర్టీసీ బస్సు సౌకర్యం వనపర్తి శాసనసభ్యులు తుడి...
అభివృద్ధి ఎక్కడంటూ.. ఎమ్మెల్యే కడియం శ్రీహరిని నిలదీసిన బీఆర్ఎస్ నాయకుడు నాయిని నరేష్ గౌడ్!
పట్టుదలతో న్యాయవాదిగా ఎదిగిన మౌనిక.
అక్రిడిటేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి.
44వ డివిజన్‌లో ఇందిరమ్మ బీమాపై విస్తృత ఇంటింటి ప్రచారం.
ఇళ్ల స్థలాల కోసం రోడ్డెక్కిన జర్నలిస్టుల ఉద్యమం.
మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే మేఘారెడ్డి.