మానేరు కట్ట అభివృద్ధికి కెఎన్ఆర్ కృషి.

పిచ్చి మొక్కల తొలగింపు, వీధి దీపాల వెలుగులకు చర్యలు.. యోగా షెడ్డు నిర్మాణానికి కృషి.

మానేరు కట్ట అభివృద్ధికి కెఎన్ఆర్ కృషి.

కరీంనగర్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ మానేరు కట్టపై సుడా మాజీ చైర్మన్ కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి కెఎన్ఆర్ మార్నింగ్ వాక్ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

మానేరు కట్టపై పిచ్చి మొక్కలను తొలగించేందుకు కృషి చేశానని, కట్టపై అన్ని వీధి దీపాలు వెలిగేలా చర్యలు తీసుకున్నానని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం మానేరు కట్టపై యోగా షెడ్డు నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాలని, తమ తమ కాలనీలలో ప్రజలకు ఈ పథకం గురించి తెలియజేయాలని సూచించారు. తాను ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటానని, ఎవరికైనా ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారం కోసం కృషి చేస్తానని కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి  పేర్కొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రానైట్ మాఫియాపై బీజేపీ మౌనం ఎందుకు? గ్రానైట్ మాఫియాపై బీజేపీ మౌనం ఎందుకు?
*అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపించాలి.* *ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ విధానాన్ని రద్దు చేయాలి: బండారి శేఖర్.* *కరీంనగర్, నవంబర్ 23 (తెలంగాణ...
మానేరు కట్ట అభివృద్ధికి కెఎన్ఆర్ కృషి.
భక్తిపారవశ్యంలో వల్లభాపురం శివాలయం.. కార్తీక పౌర్ణమికి అర్చకుల ప్రత్యేక ఏర్పాట్లు!
కాంగ్రెస్ ఆరోపణలకు భయపడేది లేదు.. ప్రజాస్వామ్య పరిరక్షణే బీజేపీ లక్ష్యం!
కేసీఆర్ దీక్షతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజం.
వైద్య పరికరాలున్నా.. పేదలకు అందని వైద్యం.
ఎమ్మెల్యే చొరవతో మూడు గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం.