టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ ఆదిత్య రెడ్డి.
వనపర్తి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు)
తెలంగాణ రాష్ట్రానికి నూతన ఇన్‌చార్జిగా నియమితులైన బి.ఎం. సందీప్ జీ నాయకత్వంలో నిర్వహించిన టీపీసీసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సమావేశంలో రాష్ట్ర ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ (ఏఐపిసి) అధ్యక్షులు, వనపర్తి నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఏఐపీసీ సంస్థాగత బలోపేతం, రాష్ట్రవ్యాప్తంగా సంస్థ విస్తరణ, కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో ప్రొఫెషనల్స్ భాగస్వామ్యం, యువతకు రాజకీయాల్లో అవకాశాల కల్పన వంటి కీలక అంశాలపై చర్చించారు.వివిధ వృత్తులకు చెందిన నిపుణులను కాంగ్రెస్ పార్టీతో అనుసంధానం చేస్తూ, వారి నైపుణ్యాలు, ఆలోచనలు, అనుభవాలను ప్రజాసేవకు వినియోగించుకోవాల్సిన అవసరాన్ని సమావేశంలో ప్రస్తావించారు. ఏఐపీసీ విభాగాన్ని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంస్థ కార్యకలాపాలను విస్తరించేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై డాక్టర్ ఆదిత్య రెడ్డి తన అభిప్రాయాలను వెల్లడించారు.రాబోయే రోజుల్లో ఏఐపీసీ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, యువతకు రాజకీయాల్లో అవకాశాలు కల్పించడానికి, రాష్ట్ర అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని డాక్టర్ జిల్లెల ఆదిత్య రెడ్డి పేర్కొన్నారు.


Comments