హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.

హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.

*రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలి*

*సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ప్రతినిధుల విజ్ఞప్తి*

హుజురాబాద్, నవంబర్ 23 (తెలంగాణ ముచ్చట్లు): 

హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ హుజురాబాద్ నియోజకవర్గ అధ్యక్షుడు తిరగమల్ల నాగార్జున కోరారు. సోమవారం ఆయన ఆధ్వర్యంలో కమిటీ ప్రతినిధులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ను కలిసి ఆసుపత్రిలో రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలు, వైద్యులు, సిబ్బంది అందుబాటు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం
ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం వచ్చే పేద, మధ్యతరగతి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన బాధ్యత ఆసుపత్రి యంత్రాంగంపై ఉందని కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలించక ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోలేని అనేకమంది నిరుపేదలు ప్రభుత్వ ఆసుపత్రులపైనే ఆధారపడుతున్నారని తెలిపారు. అలాంటి వారికి నాణ్యమైన వైద్యం అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని స్పష్టం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News