ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
*16వ డివిజన్ మల్కాపూర్‌లో మార్నింగ్ వాక్.*
*ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై కరపత్రాలు పంపిణీ చేసిన సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి.*
కరీంనగర్, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
అర్హులైన ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సుడా మాజీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి (కేఎన్ఆర్) కోరారు. పథకంలో నమోదు చేసుకునేందుకు తెల్ల రేషన్ కార్డు, ఆధార్ కార్డుతో సమీపంలోని వార్డు కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
కేఎన్ఆర్ మార్నింగ్ వాక్‌లో భాగంగా 16వ డివిజన్ మల్కాపూర్‌లో స్థానిక కార్పొరేటర్ కాంతాల జగన్ రెడ్డి, నాయకులతో కలిసి పలు కాలనీల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ కుటుంబ భీమా పథకంపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. పథకంలో నమోదు చేసుకున్నారా లేదా అని స్థానికులను అడిగి తెలుసుకుని, నమోదు కానివారు వెంటనే వార్డు కార్యాలయంలో నమోదు చేసుకోవాలని సూచించారు.
అనంతరం గతంలో సుడా నిధులతో మంజూరైన మురుగుకాలువల నిర్మాణ పనులను పరిశీలించి, త్వరలో పనులు ప్రారంభిస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. విలీన గ్రామాల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Comments