తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలి.

తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలి.

*నవంబర్ 29న అలుగునూరులో జరిగే దీక్షా దివస్ సభను విజయవంతం చేయాలి– బోయినపల్లి వినోద్ కుమార్*

ఇల్లంతకుంట, నవంబర్ 24 (తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో 2009 నవంబర్ 29న కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష చారిత్రక ఘట్టమని, ఆ పోరాట స్ఫూర్తిని నేటి యువతకు, భావితరాలకు తెలియజేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.

ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నవంబర్ 29 దీక్షా దివస్ సభ ఏర్పాట్లపై నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షతో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడిందని, విద్యార్థులు, యువత, ఉద్యోగులు, ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమంలో భాగస్వాములయ్యారని గుర్తుచేశారు. సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, సాగరహారం వంటి ఉద్యమ కార్యక్రమాల అనంతరం 2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందన్నారు.

తెలంగాణ సాధన కోసం యువత చేసిన త్యాగాలు, ఉద్యమకారుల పోరాటాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, దీక్షా దివస్ ప్రాధాన్యతను ప్రతి ఇంటికి చేరవేయాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని అలుగునూరులో నిర్వహించనున్న దీక్షా దివస్ బహిరంగ సభకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. పూర్వ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలంగాణ ఉద్యమకారులు, యువత, విద్యార్థులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు.

ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జి.వి. రామకృష్ణారావు, మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సిద్ధం వేణు, మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి, తిరుపతి, నర్సయ్య, సర్పంచులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ ఆదిత్య రెడ్డి. టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న డాక్టర్ ఆదిత్య రెడ్డి.
వనపర్తి,నవంబర్24(తెలంగాణ ముచ్చట్లు)  తెలంగాణ రాష్ట్రానికి నూతన ఇన్‌చార్జిగా నియమితులైన  బి.ఎం. సందీప్ జీ నాయకత్వంలో నిర్వహించిన టీపీసీసీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ సమావేశంలో రాష్ట్ర ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్...
ఇందిరమ్మ కుటుంబ భీమా పథకాన్ని అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలి.
తెలంగాణ ఉద్యమ చరిత్రను భావితరాలకు తెలియజేయాలి.
హుజురాబాద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్‌కు ఘన సన్మానం.
హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి.
సదర్ ఉత్సవాలతో యాదవుల ఐక్యత చాటాలి.
ఆధారాలతో నిరూపిస్తాం.. రాజయ్య అభివృద్ధిపై చర్చకు కడియం సిద్ధమా?